ఆదిలాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) రైతులు శనివారం పొలాల్లో తాళ్లు పట్టుకుని ఉరి నమూనాలతో నిరసన తెలిపారు. మాజీ ఎంపీటీసీ సుభాష్ మాట్లాడుతూ..
రైతు భరోసా రాకపోవడంతోపాటు గ్రామంలో 50 శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో రైతులందరికీ రుణమాఫీ చేశామని అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఒకసారి తమ గ్రామానికి వచ్చి చూస్తే పరిస్థితి అర్థమవుతుందన్నారు.