వడ్డేపల్లి, జనవరి 15 : ఆర్డీఎస్ కెనాల్‌కు సాగునీరు(Irrigation water) విడుదల చేసి పంటలు కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం జోగుళాంబ గద్వాల(Gadwala Dist) జిల్లా శాంతినగర్‌లో రైతులు ఆర్డీఎస్ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత వడ్డేపల్లి సూరి మాట్లాడుతూ.. వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో వందలాది ఎకరాల్లో వేసిన మొక్కజొన్న, మిరప పంటలు సాగునీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించి సాగునీటిని విడుదల చేయాలని కోరారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని అధికారులతో మాట్లాడిస్తామని కార్యక్రమాన్ని విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు రాంబాబు, తోట వెంకటేశ్, మన్నెపురెడ్డి, రంగస్వామి, మద్దిలేటి, గోకారి, మక్భూల్పాషా, మద్దిలేటితోపాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Armoor | ఆర్మూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు
Chinese manja | విషాదం..ఇద్దరి మెడను కోసేసిన చైనా మాంజా.. హాస్పిటల్‌కు తరలింపు
Harish rao | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలి : హరీశ్ రావు