మోర్తాడ్, అక్టోబర్ 19: సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ రైతులు మండలకేంద్రంలోని భీమ్గల్ చౌరస్తా వద్ద ఆదివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా సోయాపంటను దళారులు రూ.1500 తక్కువకు కొనుగోలు చేస్తున్నారని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
సోయా, మక్కల కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని, వడ్లకు బోనస్ చెల్లించాలని, రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలని, ఎటువంటి షరతులు లేకుండా పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.