ఉప్పునంతల, జూన్ 26 : పాడి రైతులు రోడ్డెక్కారు. విజయ డెయిరీ పాలు కొనుగోలు చేసినా రెండు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని పోచమ్మ చౌరస్తాలో బుధవారం ధర్నాకు దిగారు.
క్యాన్లలో తీసుకొచ్చిన పాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సకాలంలో పాల డబ్బులు రాకపోవడంతో పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నామని వాపోయారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉన్నదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సకాలంలో బిల్లులు అందేవని వారు గుర్తుచేశారు.
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం రామగుండం పర్యటనలో భాగంగా తొలిసారిగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరుపై అధికారులతో కమిషనర్ చాంబర్లో సమీక్షిస్తుండగా కరెంటు పోయింది. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగడంతో కార్యాలయంలో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి.
– కోల్‌సిటీ
ఆరు నెలలుగా జీతాలు చెల్లించకుంటే ఎట్లా బతికేదని గ్రామపంచాయతీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జనగామ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి కలెక్టరేట్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను పరిషరించాలని కోరుతూ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
– జనగామ
ఈ ఏడాది ‘దశాబ్ది బోనాల ఉత్సవాలు’ పేరుతో బోనాల పండుగ నిర్వహించాలని అధికారులను దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. గోలొండ జగదాంబ మహాకాంళి బోనాల ఏర్పాట్లను బుధవారం పరిశీలించి అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, ముస్లిం సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆషాడ బోనాల పండుగకు ఏర్పాట్ల నిమిత్తం ప్రభుత్వం రూ. 20 కోట్లు విడుదల చేస్తూ బుధవారం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల రెండురోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల బలమైన ఉపరితల గాలులతో వర్షాలు కురుస్తాయని పేరొన్నది. బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అకడకడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ సీజన్లో కామారెడ్డి, కుమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాలలో లోటు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది