Farmers Protest | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు భారీ రాస్తారోకో నిర్వహించారు. పంట కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల, ఇటీవల కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోవడం, సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ధాన్యం వర్షానికి తడిసి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని మర్రి జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నెల్లికొండ మార్కెట్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ వెంటనే స్పందించిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Nagarkurnool Protest1

Nagarkurnool Protest2

Nagarkurnool Protest3