వికారాబాద్, డిసెంబర్ 30 : పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి మాట తప్పడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వికారాబాద్ లోని అయ్యప్ప కాటన్ మిల్లుకు పత్తిని తీసుకొచ్చారు. మిల్లు యాజమానులు రోజుకు 2వేల కింటాళ్లే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయని, చెప్పడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.
జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి మహవీర్ చౌరస్తా వద్ద పత్తిలోడ్‌తో ఉన్న వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కలుగజేసుకొని సమస్యను కలెక్టర్‌కు విన్నవించుకోవాలని సూచించారు. రైతులు పత్తి వాహనాలను తీసుకొని కలెక్టరేట్‌కు చేరుకున్నారు.