Congress Govt | కాంగ్రెస్ ఏడాది పాలనలో సాగు ఆగమైంది.. రైతుల బతుకు దుర్భరమైంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు దగ్గర్నుంచి పంట అమ్మకం వరకు అడుగడుగునా అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతూనే ఉన్నారు. విత్తనాల కొనుగోలు కోసం బారులు తీరడంతో పాటు పంట అమ్మకం కోసం రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో నిరీక్షించాల్సిన దుస్థితి వరకు అన్నదాతల ఆవేదన వర్ణణాతీతం.
పచ్చని పంటపొలాల్లో సర్కారు ఫార్మా చిచ్చు పెట్టడంతో కర్షకులు ఆందోళన బాటపట్టారు. అరకొర రుణమాఫీతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. కరెంట్ కష్టాలు.. కొనుగోళ్ల తిప్పలు.. ఇలా ఏడాది కాలంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్నదాతల ఆందోళనలు… కర్షకుల కన్నీళ్లే కనిపించాయి.
ఫార్మాసిటీ ప్రతిపాదనను నిరసిస్తూ.. భూసర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా డప్పూర్, మల్లి గ్రామాల ప్రజల ఆందోళన
వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ఆలస్యం కావడంతో అలసిపోయి కునుకుతీస్తున్న మహిళా రైతు
అమ్మకానికి తెచ్చిన ధాన్యం కొనే నాథుడు లేక రైతులు నిరీక్షించాల్సి వస్తున్నది. ఓ యార్డులో వర్షంతో తడిసిముద్దయిన ధాన్యం ఎత్తుకుంటూ విలపిస్తున్న రైతులు
మహబూబ్నగర్ జిల్లాలో రూ.1.30 లక్షల వ్యవసాయ రుణం, వడ్డీ చెల్లించాలని వచ్చిన నోటీస్ను చూపిస్తున్న సింగారం గ్రామానికి చెందిన ఉడుత పార్వతమ్మ
వడ్లు కొనడం లేదని ఆవేదన చెంది యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరులో ధాన్యం రోడ్డుపై పోసి నిప్పంటించిన రైతులు
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి యూనియన్ బ్యాంకులో రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు బారులుతీరిన రైతులు
జనగామ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో హమాలీలు, చీపురు కార్మికులు అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించాలని ఆందోళనకు దిగగా అక్కడికి వచ్చిన పోలీసు అధికారి కాళ్లు మొక్కిన కూలీ అనురాధ
సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో 16 రోజుల పాటు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో సబ్స్టేషన్లో ఆందోళనకు దిగిన రైతులు
గిట్టుబాటు ధర కోసం ఖమ్మం మార్కెట్ యార్డు ఎదుట ఆందోళనకు దిగిన మిర్చి రైతులు
పత్తికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం తిమ్మారెడ్డిపల్లి తండాలోని కాటన్ మిల్లు ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో విత్తనాల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో క్యూలైన్లో చెప్పులు పెట్టిన రైతులు
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన రైతులు
మెదక్ జిల్లా చేగుంట మండలం కొండాపూర్లో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందిన బోయిన గణేశ్
మెదక్ జిల్లా కొల్చారం ధర్నాలో పురుగుల మందు డబ్బాతో నిరసన తెలుపుతున్న మహిళా రైతు వెంకటమ్మ
నిర్మల్ జిల్లా సిర్పెల్లి(హెచ్)కు చెందిన రైతు జాదవ్ మారుతి సాగుకు చేసిన అప్పులు తీరకపోవడంతో కరెంటు తీగలు పట్టుకుని విద్యుత్తు షాక్ తగిలి ప్రాణం తీసుకున్నాడు.