తొర్రూరు, నవంబర్ 20: తడిసి, నలుపెక్కిన ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండ లం మాటేడులో గురువారం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా.. కొనుగోలు కేంద్రాల్లో మాత్రం అమలు కావడం లేదని మండిపడ్డారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధాన్యం తడిసి నలుపెక్కడంతో కొనేదిలేదని అధికారులు స్పష్టంగా చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.