ధరూరు, ఫిబ్రవరి 26 : యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు కరెంట్ కోతలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఆగ్రహించిన రైతులు బుధవారం గద్వాల జిల్లా అల్వాల్‌పాడు సబ్‌స్టేషన్ ఎదుట రాయిచూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాల్వకు నీళ్లు వదిలి, కరెంట్ తీస్తం అంటే వ్యవసాయం ఎలా చేసుకోవాలని మండిపడ్డారు.
పంటలు ఎండిపోయే దశలో ఉంటే అధికారుల కాళ్లా వేళ్లా పడి నీరు విడిపించుకుంటే ఇక్కడ సబ్‌స్టేషన్‌లో కరెంట్ తీస్తే మోటర్లు ఎలా నడుస్తాయి, పంటలు ఎలా తడుస్తాయని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నీళ్లు, కరెంట్‌కు పడిగాపులు ఉండేవీ కావు, ఈ ప్రభుత్వం ఏందో ఎప్పుడు ఏదో సమస్య తెచ్చిపెడుతున్నదని అసహనం వ్యక్తం చేశారు.