KCR | మిర్యాలగూడ : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తాము పండించిన ధాన్యానికి మంచి ధర వచ్చిందని, ధాన్యం అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని పేర్కొంటూ పలువురు రైతులు గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ శివారులోని రైస్ మిల్లు వద్ద మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో మిర్యాలగూడ నియోజకవర్గ రైతులు సంతోషంగా ఉన్నారని, తాము పండించిన ధాన్యానికి క్వింటాకు రూ.2500 నుంచి రూ.2900 వరకు రేటు వచ్చిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం రూ. 2 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం మిల్లర్లతో మాట్లాడి తమకు ధర వచ్చేలా చూడాల్సి ఉన్నా ఆ విషయాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నల్లమోతు భాస్కర్‌రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీజన్ ప్రారంభం కాకముందే అధికారులు, మిల్లర్లను అప్రమత్తం చేసి రైతులకు మద్దతు ధర వచ్చేలా కృషి చేసేవారన్నారు. ప్రస్తుతం రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఆంగోతు లలితాహతీరాంనాయక్, మాజీ ఎంపీటీసీ ధీరావత్ వీరనాయక్, నాయకులు ధనావత్ ప్రకాశ్‌నాయక్, మాలావత్ రవీందర్‌నాయక్, ఎండీ.షోయబ్, నాగునాయక్, రమేశ్‌నాయక్, శోభన్‌నాయక్, రైతులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు
Chiranjeevi | పార్టీ మూడ్‌లో చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు.. ఇంతకీ స్పెషలేంటో తెలుసా..?