నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): ‘సార్.. ఒక్క బస్తాకు రెండు కిలోల తరుగు తీస్తున్నరు.. వడ్లు అమ్ముకునేందుకు ఎండలో పడిగాపు లు.. నిలువ నీడలేక వేడినీళ్లు తాగుతూ పొద్దంతా వడ్ల కుప్పల కాన్నే ఉంటున్నం. ఎప్పుడు కాంట ఏస్తరో తెలుస్తలేదు. కాంట ఏస్తే క్వింటాల్‌కు ఐదారు కిలోల తరుగు తీస్తుర్రు. అప్పుడేమో యూరి యా దొరక్క ఇబ్బందులు పడ్డమ్. లైన్ల లో నిలబడి దెబ్బలు తగిలిచ్చుకున్నం. ఇట్ల రై తులం మస్తు ఇబ్బందులు పడుతు న్నం.. మీరే పట్టించుకోవాలి సారూ’.. అంటూ బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావుతో రైతులు తమ గోడువెళ్లబోసుకున్నారు.
ఆదివారం హరీశ్‌రావు నల్లగొండ జిల్లా గుర్రంపోడుకు వస్తున్న విషయం తెలుసుకున్న రైతులు తానేదార్పల్లి కొనుగోలు కేంద్రం వద్ద పెద్దసంఖ్యలో గుమిగూడా రు. దీంతో హరీశ్‌రావు ఆగి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఎండబోసిన వడ్లను పరిశీలిస్తూ రైతులతో మాట కలుపగా వారంతా ఒక్కసారిగా తమ బాధను వెళ్లగక్కారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ రైతులను గాలికి వదిలేశారని విమర్శించారు.