కామారెడ్డి : అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ(Loan waiver) చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులను మోసం చేశారని రైతులు(Farmers), రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కామారెడ్డి(Kamareddy) జిల్లా పెద్ద కోడప్పగల్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ. లక్షల వరకు రుణమాఫీ చేయాలన్నారు. రుణమాఫీతో పాటు భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన రైతులు
కామారెడ్డి – పెద్ద కోడప్పగల్ మండల కేంద్రంలో రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన రైతులు, రైతు సంఘాల నాయకులు
రూ.2 లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్… pic.twitter.com/RB9QsxZzuz
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2024