రామారెడ్డి, జూన్ 21: యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆదివారం ధర్నా చేపట్టారు. శనివారం ఉప్పల్వాయి రైతులకు మధ్యాహ్నం 3 గంటలకు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని ఏడీఏ సు ధారాణి, అధికారులు సూచించారు. సాంకేతిక కారణాలతో యాప్ సాయంత్రం 6 గం టలకు ఓపెన్ కావడంతో కొందరే బుక్ చేసుకున్నారు.
ఈ విషయం తెలియని ఉప్పల్వా యి రైతులు.. అధికారులు తమను తప్పుదో వ పట్టించారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆదివారం ఆందోళనకు దిగారు. యాప్ను తొలగించాలని, ఏడీఏను సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. కామారెడ్డి ఎస్సై భువనేశ్వర్ సమాచారం మేరకు ఏడీఏ సుధారాణి ఉప్పల్వాయికి చేరుకుని రైతులతో మాట్లాడారు. తాము సూచించిన సమయానికి సాంకేతిక లోపంతో యాప్ పనిచేయలేదని, తర్వాత పనిచేయడంతో మండలంలోని పలు గ్రా మాల రైతులు బుక్ చేసుకున్నారని తెలిపారు. దీంతో రైతులు ఆందోళన విరమించి, యాప్ను రద్దుచేసి పాత పద్ధతిలోనే యూ రి యా అందించాలని కోరారు.