కుమ్రంభీం అసిఫాబాద్ : ఓవైపు అకాల వర్షాలు రైతులపై(Farmers) పగబడితే.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల కష్టాలను, నష్టాలను మరింత పెంచుతున్నాయి. చేతికొచ్చిన మిగిలిన పంటతోనైనా పెట్టుబడి వస్తుందనుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి నిరాశే ఎదురవుతున్నది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రంలోని రైతులు ఎక్కడికక్కడ రోడ్ల మీదకొచ్చి తమ నిరసనలు(Farmers concern) వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా(Asifabad) దహెగాం మండలంలోని ఒడ్డు గూడ గ్రామ రైతులు ధాన్యం కొనుగోలు(Grain purchases) ఆలస్యంపై ఆందోళన చేపట్టారు. అలాగే తూకంలో కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40కిలోల బ్యాగుకు రెండు నుంచి మూడు కిలోలు అదనంగా తూకం వేస్తున్నరని గుర్తించిన రైతులు కల్లం వద్ద ఆందోళన చేపట్టారు. సొసైటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం చేసేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చురించారు.