చిట్యాల, జనవరి 30 : మీకన్నా కేసీఆర్ ప్రభుత్వ పాలనే నయం.. అని ఓ రైతు యువజన కాంగ్రెస్ నా యకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం మండలకేంద్రంలో కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. అక్కడే ఉన్న జూకల్కు చెందిన రైతు బుస్స బాపురావు ‘బీఆర్ఎస్ ప్రభు త్వంలో టైముకు రైతు బంధు టింగ్.. టింగ్మనేది..’ అని, జై కేసీఆర్ అంటూ నినదించాడు.
కాంగ్రెస్ పాలనలో రైతుబంధు ఇంతవరకు జమకాలేదని, సంక్షేమ పథకాలు ఒకో మండలానికి ఒక్కో ఊరుకు మంజూరైతే మా ఊరికి ఎప్పుడు వస్తుందని నిలదీశారు. దీంతో యువజన కాంగ్రెస్ నాయకులు అకడి నుంచి నిష్రమించారు.