హైదరాబాద్: రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ (Rythu Runa Mafi) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించిండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబురాలు జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిశేకాలు చేస్తున్నారు. వరి చేళల్లో కేసీఆర్ (KCR) అక్షరాలు రాస్తూ ముఖ్యమంత్రికి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలోని దూది వెంకటాపురంలో నారుతో కేసీఆర్ అక్షరాలు పేర్చి రైతులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.

ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. రైతు రుణమాఫీ ప్రకటించినందుకుగాను బోధ్ మండలం సోనాలలో రైతులు తమ పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని జేపీ తండా, గట్ల మాల్యాల, సిద్దన్నపేట గ్రామాల ప్రజలు, రైతులు.. రుణమాఫీ చేసి మరోసారి రైతు బాంధవుడు అని నిదర్శనం అని చూపిన కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతు హితం కోసం ఎన్నికష్టాలు వచ్చినా.. ఇచ్చిన మాట ప్రకారం రూ.19 వేలకోట్ల పంట రుణాలు మాఫీ చేశారని ఆనందం వ్యక్తంచేశారు.

జగిత్యాల
సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని సింగల్విండో కార్యాలయం ఎదుట రైతులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు.

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లాలో..

ఖమ్మం

కోరుట్ల

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

నల్లగొండ

సిద్దిపేట

సిరిసిల్ల

సూర్యాపేట

సూర్యాపేట