ఆదిలాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా రామాయిలో రేణుక సిమెంటు పరిశ్రమ (Renuka cement industry)ఏర్పాటులో భాగంగా తమ భూములు ఇవ్వమంటూ నిర్వాసిత రైతులు గురువారం ఆదిలాబాద్(Adilabad) కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన(Farmers dharna) నిర్వహించారు. ప్రైవేట్ సిమెంటు పరిశ్రమకు భూములు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులు తమను వేధిస్తున్నారని తెలిపారు.
ఎకరాకు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల ధర పలికే భూములను రూ.8.50 లక్షలకు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ప్రైవేట్ సిమెంటు పరిశ్రమకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఎన్నో ఏండ్లుగా భూమినే నమ్మకున్న జీవిస్తున్న తమకు అన్యాయం చేయొద్దన్నారు. తన ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోవాలని రైతులు కోరారు.
ఇవి కూడా చదవండి..
Dasara Holidays | దసరా సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎప్పట్నుంచంటే..?
KTR | కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు.. తప్పుబట్టిన కేటీఆర్