వరంగల్ : పంట పొలాల్లో పనులు చేసుకోవాల్సిన రైతన్నలు కాంగ్రెస్ పాలనలో రోడ్డెక్కుతున్నారు. నిన్న, మొన్నటి వరకు కరెంట్, సాగు నీటి కోసం అష్టకష్టాలు పడ్డ రైతులు నేడు రుణమాఫీ కోసం(Loan waiver) ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన(Farmers concern) దుస్థితి నెలకొంది. తాజాగా వరంగల్(Warangal) జిల్లా వర్ధన్నపేటలో రుణమాఫీ కాలేదని రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. రుణమాఫీ కాలేదని, కొత్త రుణాల మంజూరులో బ్యాంకర్లు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఎస్బీఐ బ్యాంకు ముందు రోడ్డుపై బైఠాయించారు. అన్నదాతల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతన్నలు
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రుణమాఫీ కాలేదని రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేశారు.
రుణమాఫీ కాలేదని, కొత్త రుణాల మంజూరులో బ్యాంకర్లు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఎస్బీఐ బ్యాంకు ముందు రోడ్డుపై బైఠాయించారు. pic.twitter.com/inxjC5b8Mx
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2024