మిర్చి రైతుల కన్నెర్ర
మిర్చి పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై సర్కారు ఆరా తీసింది.
- కడుపు మండి.. రోడ్డెక్కి
- గిట్టుబాటు ధర కోసం ఖమ్మం మార్కెట్ ఎదుట ఆందోళన
- సర్కారు ఆరా.. అధికారుల తీరుపై మంత్రి తుమ్మల అసహనం
ఖమ్మం వ్యవసాయం, మార్చి 1: మిర్చి పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై సర్కారు ఆరా తీసింది. మార్కెటింగ్ అధికారుల తీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని ఆదేశించారు. వివరాలు ఇలా.. ఖమ్మం ఏఎంసీకి జిల్లా నుంచేకాక భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి మిర్చి తరలివస్తున్నది. రోజుకు కనీసం 60 వేల బస్తాలకు తగ్గడం లేదు. వ్యాపారులు రోజూ ఉదయం నిర్వహించే జెండాపాటలో ధర తగ్గిస్తుండటం, జెండాపాటలో ఖరీదుదారుల మధ్య పోటీ లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జెండాపాటలో మిర్చి క్వింటాల్ గరిష్ఠ ధర రూ.20,800 పలికింది. జెండాపాటకు ఒకరిద్దరు ఖరీదుదారులు మాత్రమే రావడం, మరోవైపు కొందరు వ్యాపారుల గుమస్తాలు పంటకు ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు మండిపడుతూ మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక దశలో మార్కెట్ యార్డు గేట్లను మూసి వేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మార్కెటింగ్‌శాఖ అధికారి ఎంఏ అలీం, ఉద్యాన అధికారి రమణ, త్రీటౌన్ సీఐ రమేశ్ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ వచ్చి రైతులతో మాట్లాడారు. పంట నాణ్యతను బట్టే క్రయ విక్రయాలు జరుగుతాయని, జెండా పాటకు ఖరీదుదారులంతా వస్తారని చెప్పడంతో రైతులు శాంతించారు.
మంత్రి తుమ్మల ఫైర్
ఖమ్మం మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళనపై మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో మార్కెటింగ్ డైరెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

