నమస్తే తెలంగాణ నెట్వర్క్: యూరియా దొరకక అన్నదాతలు విలవిలలాడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద తెల్లవారుజాము నుంచే చలిలో సైతం క్యూలో పడిగాపులు కాస్తున్నారు. పనులన్నీ మానుకొని బస్తా యూరియా కోసం రోజంతా వేచి ఉంటున్నారు. నిల్వలు లేక అధికారులు కూపన్లు జారీ చేసి కొద్దిమందికే యూరియా పంపిణీ చేస్తున్నారు. దీంతో అన్నదాతలకు నిరాశ తప్పడంలేదు.