రాజంపేట్, మార్చి 25 : యాసంగి సాగులో రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో బోర్లు వట్టిపోతున్నాయి. దీంతో నీరందక పంటలు ఎండిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని రాజంపేట, తలమడ్ల గ్రామాల్లో పొట్ట దశలో ఉన్న పంటలు నీరు అందక నెర్రెలు బారుతున్నాయి. కొందరు కొత్తగా అప్పులు చేసి బోర్లు వేసినా చుక్కనీరు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
రెండెకరాల్లో మక్క వేసిన. ఇప్పుడు బోర్లు ఎ త్తిపోవడంతో పంట ఎండిపోతున్నది. రూ.లక్ష అప్పు చేసి రెండు బోర్లు వేయించగా.. అవి ఫెయిలయ్యాయి. సగం పంట ఎండిపోవడంతోపాటు అప్పుల పాలైన.
ఐదెకరాల్లో వరి సాగుచేస్తుండగా బోర్లలో ధార తగ్గిపోయింది. పంటలకు నీరందడంలేదు. చుట్టూ ఉన్న చెరువులు, కుంటల్లో నీళ్లు ఉంటే బోర్లు ఎత్తిపోయేవికాదు. నీరందక పంట ఎండిపోతున్నది.