మల్లాపూర్ : యూరియా బస్తాల కోసం రైతన్నకు తిప్పలు తప్పడం లేదు. మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్‌లోని సహకార సంఘానికి 340 బస్తాల యూరియా వచ్చింది. దీంతో సంఘం పరిధిలోని ధర్మారం, చిట్టాపూర్ గ్రామాలకు చెందిన రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
పట్టా పాస్‌పుస్తకం, ఆధార్ జిరాక్స్‌లను కార్యాలయం ఆవరణలో క్యూలో పెట్టారు. చివరకు యూరియా అందక చాలామంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.