భీమ్‌గల్, మార్చి 7: పొట్టకొచ్చిన వరి పైర్లు ఎండిపోతుంటే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. తక్షణమే సర్కారు స్పందించి 21వ ప్యాకేజీ ద్వారా కప్పలవాగులోకి నీటిని వదలాలని నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో రైతులు, బీఆర్ఎస్ నేతలు గురువారం ధర్నా నిర్వహించారు.
నీళ్లు వదలాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి లేఖ రాశారని, ప్రభుత్వం నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని కోరారు.