సూర్యాపేట, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ‘నాకున్న ఏడెకరాల్లో 4 ఎకరాలు ఎండిపోగా పక్కనే ఉన్న మూడెకరాలు బోర్లతో కాపాడుకుంటున్నా. అసలు ముఖ్యమంత్రి పదవి లో ఉన్న ఆయనకు ఏమన్నా మైండ్ పనిచేస్తున్నదా? నీళ్లు లేక ఎండిన 4 ఎకరాలు.. దాని పక్కనే మరో మూడెకరాలు ఆనుకునేఉన్నయి. సూర్యుడేమైనా మా దుష్మనా.. పగబట్టి 4 ఎకరాలను ఎండబెట్టిండా? ఇంతకంటే పెద్ద జోకు మరొటి ఉంటదా?’ అని ఎండిపోతున్న వరిపొలాన్ని చూస్తూ కడుపుకాలిన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేం ద్రానికి చెం దిన రైతు జాన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘వ్యవసాయం అంటే ఏంటో రేవంత్‌కు తెలియదు.
డబ్బులు సంపాదించేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్టుంది.. ఏదన్న మాట్లాడితే ఆలోచించి మాట్లాడాలి.. కేసీఆర్ నీళ్లు తెచ్చి ఇస్తే ఆరేడేండ్లు బాగా పంటలు పండించుకున్నం.. రేవంత్ వచ్చి నీళ్లు ఆపేసిం డు. మనిషికి చిన్న రోగం వస్తే వెంటనే దవాఖానకు పోతం.. మరి కేసీఆర్ అం తపెద్ద కాళేశ్వరం కడితే చిన్న మరమ్మ తు చేయించి నీళ్లివ్వాలనే బుద్ధి పుడత లేదా ? నీళ్లిచ్చే చేతకాకనే అలాంటి మాటలు మాట్లాడుతున్నడు.. రైతుబం ధు ఇయ్యలేదు. 90 క్వింటాళ్ల సన్న ధాన్యానికి ఇప్పటికీ బోనస్ పడలేదు. రుణమాఫీ కాలేదు.. నీకు ఓట్లేసి గెలిపించినందుకు చెంపలేసుకుంటున్నం’ అని మండిపడ్డాడు. ‘ఏదో కేసులో రేవంత్ దొరికిండట కదా.. ఆ కేసులో జైలుకు పోయినా బాగుండేది.. వేరే ముఖ్యమంత్రి వస్తే.. మాకు నీళ్లు వచ్చేవేమో’ అని పేర్కొన్నాడు.