Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ) : రైతులకు రుణమాఫీ చేయడానికి, రైతుభరోసా ఇవ్వడానికి, విపత్తుల వల్ల పంట నష్టపోయిన అభాగ్యులకు పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వలేదు. కానీ, చేయని రుణమాఫీపై, ఇవ్వని రైతుభరోసాపై ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేసుకోవడానికి మాత్రం రేవంత్రెడ్డి సర్కారు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నది. రూ.28 కోట్లతో ఊరూరా ఫ్లెక్సీలు కట్టించి రుణమాఫీ, రైతుభరోసాపై ఆర్భాటంగా ప్రచారం చేయిస్తున్నది. రైతులు ఏమైపోయినా, వారు ఎంత దీనస్థితిలో ఉన్నా తమకు మాత్రం ప్రచారమే ముఖ్యమన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ది. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పంటనష్టం జరిగి నెల రోజులు గడుస్తున్నా పరిహారంపై ఇప్పటివరకు సడీసప్పుడు లేదు. దీంతో సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు పరిహారం ఇవ్వాలన్న ఆలోచన చేయకుండా.. మాఫీ, భరోసా అయిపోయినట్టుగా ఆగమేఘాలపై రూ.28 కోట్లు ప్రచారానికి విడుదల చేయడంపై అన్నదాతలు దుమ్మెత్తి పోస్తున్నారు.
గత నెలాఖరుతోపాటు ఈ నెల మొదట్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురవడంతో భారీగా పంట నష్టం జరిగింది. మార్చిలో కురిసిన వర్షాలకు 11,298 ఎకరాల్లో, ఈ నెల మొదట్లో కురిసిన వర్షాలకు 14,956 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచ నా వేసింది. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రభు త్వం ప్రకటించినప్పటికీ ఆ మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. పంట లు నష్టపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నష్టపరిహారం చెల్లించే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. రైతుల పట్ల రేవంత్ సర్కారుకు ఏమా త్రం ప్రేమ లేదని స్పష్టమవుతున్నది.
రుణమాఫీ, రైతుభరోసా అమలు సక్రమంగా లేకపోవడంతో రేవంత్సర్కారుపై అన్నదాతలు నమ్మకం కోల్పోయా రు. రైతులు నమ్మడం లేదని ప్రభుత్వం ఆ రెండు పథకాలపై ప్రచారానికి దిగింది. రుణమాఫీ, రైతుభరోసా లబ్ధిదారుల పేర్లతో ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు ఇటీవల రూ. 28 కోట్లు విడుదల చేసింది. కాగా అకాల వర్షాలతో జరి గిన పంట నష్టానికి పరిహారం పంపిణీ చేసేందుకు రూ.26.25 కోట్లు అవసరమవుతాయి. నిధులు లేక పరిహారం పంపిణీ అంశాన్ని పక్కన పెట్టినట్టు సమాచారం. దీంతో చేయని రుణమాఫీ, అమలుకాని రైతుభరోసాపై ప్ర చారం కోసం రూ.28 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఆ నిధులను పంట నష్టపరిహారం చెల్లింపునకు వెచ్చిస్తే సరిపోయేవి కదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.