చిట్యాల (మొగుళ్లపల్లి), జూన్ 8 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెం దిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ఇస్సిపేట లో శనివారం చోటుచేసుకున్నది. ఇ స్సిపేటకు చెందిన యార రాజిరెడ్డి (58) వడ్లు బియ్యం పట్టించేందుకు కిరాయికి టాటా ఏస్ వాహనం వచ్చింది. ఆ వాహనం ఇంటి ఆవరణలోకి వస్తుండగా, కరెంటు సర్వీస్ వైరు తగులుతుందని భావించి చేతితో పైకి ఎత్తాడు. రాజిరెడ్డి ఆ వైరును పట్టుకోవడంతో ఒక్కసారిగా షార్ట్సర్క్యూట్కు గురై ఆయన అకడికకడే మృతిచెందాడు.