Panchaythi Elections | కాంగ్రెస్ నాయకుడి రాక్షసానందం.. ఓటేయలేదన్న అక్కసుతో ఓ రైతు వరి ధాన్యాన్ని తడిపేశాడు
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయలేదన్న అక్కసుతో ఆ పార్టీ నాయకుడు ఓ రైతుకు పంటనష్టం కలిగించి రాక్షసానందం పొందాడు.
- బాధిత రైతు సహా గ్రామస్తుల నిరసన
- భద్రాద్రి జిల్లా గంగారం తండాలో ఘటన
Panchaythi Elections | జూలూరుపాడు, డిసెంబర్ 19: పంచాయతీ ఎన్నికల్లో (Panchaythi Elections) కాంగ్రెస్కు (Congress) ఓటు వేయలేదన్న అక్కసుతో ఆ పార్టీ నాయకుడు ఓ రైతుకు పంటనష్టం కలిగించి రాక్షసానందం పొందాడు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా గంగారంతండాలో కొర్రా చిన్నరాములు తన రెండెకరాల్లో సాగుచేసిన వరి పంటను నూర్పిడి చేసి పంట పొలంలోనే కల్లం చేసి ధాన్యాన్ని ఆరబోశాడు. శుక్రవారం ఉదయం కల్లం వద్దకు వెళ్లి చూడగా ధాన్యం మొత్తం నీటిలో తేలియాడుతూ కనిపించింది. దీంతో లబోదిబోమంటూ రైతు, కుటుంబసభ్యులు చుట్టుపక్కల రైతులను పిలిచి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే ధాన్యం మొత్తం తడిసి రంగుమారడంతో గ్రామంలోని రహదారిపై పోసి గ్రామస్తులతో కలిసి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నరాములు చేను పక్కనే కాంగ్రెస్ నాయకుడు కొర్రా సామ్య మిర్చిపంటను సాగుచేస్తున్నాడు. గురువారం రాత్రి సామ్య తన మిర్చితోట నుంచి నీళ్లు పెట్టి పక్కనే ఉన్న వరిధాన్యం మొత్తం తడిసిపోయేలా నీటిని వదిలాడు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సామ్య బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని చిన్నరాములుని కోరాడు. కానీ చిన్నరాములు ఓ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలుకడంతో అతనిపై సామ్య కోపం పెంచుకున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి మూడు ఓట్లతో గెలిచినప్పటికీ కోపంతో ఉన్న సామ్య గురువారం రాత్రి తన చేనులోని మోటరు ద్వారా మిర్చిపంట మీదుగా వరి కల్లంలోకి నీళ్లు పెట్టి ధాన్యాన్ని తడిపి రాక్షసానందం పొందాడు. చిన్నరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

