ఐనవోలు, జూన్ 12 : అప్పు ల బాధతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో గురువారం వెలుగుచూసింది. స్థానికులు, ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. పంథిని గ్రామానికి చెందిన సట్ల అశోక్(43) గీత కార్మికుడు.
పెట్టుబడి కోసం నిరుడు రూ.5 లక్షల అప్పు చేశాడు. సరైన దిగుబడి రాకపోవడంతో అప్పు అ లాగే ఉండిపోయింది. ఈ క్రమంలో మనోవేదనకు గురైన అశోక్ మంగళవారం ఇంటి నుంచి వెళ్లి.. గురువారం ఓ పొలం వద్ద శవమై కనిపించాడు. పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.