ఇచ్చోడ, డిసెంబర్ 2: సాగులో ఆశించిన మేర దిగుబడులు రాకపోవడం, అప్పులు భారంగా మారడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రై తు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఇచ్చోడ మం డలం జున్ని గ్రామానికి చెందిన దొంగ్రీ జ్ఞానేశ్వర్ (43) కు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది.
పత్తి సాగు కోసం అప్పు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. సోమవారం పొలానికి వెళ్లాడు. అక్కడే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.