సైదాపూర్, మే 18 : కాలం కలిసి రాక.. అప్పులు తీర్చే మార్గం లేక కరీంనగర్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం రాయికల్‌కు చెందిన రావుల తిరుపతిరెడ్డి (38) తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు.
కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దిగుబడులు సరిగా రాలేదు. పంట పెట్టుబడి, ఇతర అవసరాల కోసం సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.