Heart Attck | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో రైతు బలయ్యాడు. కోతలు పూర్తయినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని తీవ్ర వేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన రైతు ఐలయ్య ఇటీవల పంటను కోశాడు. వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. కానీ ప్రభుత్వం పంట కొనుగోళ్లలో జాప్యం చేస్తుండటంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం మబ్బులు కమ్మేయడంతో వర్షం పడేలా ఉందని.. ఎండబోసిన వడ్లను వెంటవెంటనే కుప్పపోశాడు. ఈ క్రమంలో గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలాడు.