పర్వతగిరి, అక్టోబర్ 16 : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపెల్లి గ్రామంలో ఓ రైతు గుండె బుధవారం ఆగింది. గ్రామానికి చెందిన రైతు గుర్రం నర్సయ్య (62) పర్వతగిరిలో ధరణి ఫర్టిలైజర్స్ యజమాని వద్ద సూపర్ సీడ్ కంపెనీకి చెందిన వరి విత్తనాలు కొనుగోలు చేశాడు. వాటిని తనకున్న ఎకరం పొలంతోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేశాడు. పంట దిగుబడి రాకపోవడంతో రెం డు రోజులుగా మదనపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజాము న గుండెపోటుకు గురై మృతిచెందాడు. నర్సయ్య కొనుగోలు చేసిన వరి విత్తనా లు నకిలీవని తేలిందని, సదరు కంపెనీపై చర్యల కోసం ఉన్నతాధికారులకు నివే దించినట్లు మండల వ్యవసాయాధికారి ప్రశాంత్‌కుమార్ తెలిపారు.
నల్లగొండ, అక్టోబర్ 16 : ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాదిలోనే రూ.31 వేల కోట్ల రైతు రుణమాఫీని పూ ర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. బుధవా రం నల్లగొండ జిల్లా కేంద్ర శివారులోని బత్తాయి మార్కెట్లో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెల్ల కార్డు లేని కారణం గా ఆగిన నాలుగు లక్షల మంది రైతులకు ఈ నెలలోనే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రెండు లక్షలకుపైగా ఉన్న రు ణాలకు సంబంధించి కూడా మాఫీ కో సం ప్రయత్నం చేస్తున్నామని, అందుకో సం త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని తె లిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ పంట కాలానికి రైతు భరోసా కూడా అందజేస్తామని చెప్పారు. సన్నాలు క్విం టాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి.. వచ్చే జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు స న్న బియ్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.