పెద్దకొత్తపల్లి, జనవరి 23 : విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్‌దిన్నె గ్రామ పంచాయతీ వేడుకరావుపల్లి తండాకు చెందిన అమ్రునాయక్ (63)కు ఐదెకరాల పొలం ఉన్నది.
ఇందులో మినుములు సాగు చేశాడు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం 10 గంటలకు పంటకు నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. బోరు స్టార్టర్ వద్ద కరెంట్ వైర్ తెగి ఉండగా.. గమనించకుండా మోటర్ ఆన్ చేసే క్రమంలో వైర్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు.