బీబీపేట్ (దోమకొండ), జనవరి 22: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్లో విద్యుత్తుషాక్తో ఓ రైతు మృతి చెందినట్టు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం.. సంగమేశ్వర్ గ్రామానికి చెందిన మొగుల్ల సిద్దయ్య(59) అడవిపందుల బెడద నుంచి పంటను కాపాడుకోవడానికి ప్రతి రోజు మక్కజొన్న చుట్టూ విద్యుత్తుతీగలు అమర్చి మరుసటి రోజు తెల్లవారుజామున తొలగించేవాడు.
బుధవారం ఉదయం 6 గంటల సమయంలో మక్కజొన్న పంట చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్తుతీగను తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య బీరవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.