రామారెడ్డి, మే 21: విద్యుత్తు షాక్తో రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఘన్పూర్(ఆర్) లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా రాజు(35) బుధవారం ఉదయం తన పొలంలో గెట్లపై ఉన్న మొక్కలను గొడ్డలితో తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో బోరుబావికి విద్యుత్ సరఫరా అవుతున్న సర్వీస్ వైరు ప్రమాదవశాత్తు గొడ్డలికి తగిలి, అతడి చేతిపై పడింది.
దీంతో రాజుకు షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇచ్చి, కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు అతడు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడి భార్య వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని ప్రొబేషనరీ ఎస్సై నవీన్చంద్ర తెలిపారు. .