కరెంట్ షాక్‌కు రైతు బలి.. నారాయణపేట జిల్లా పగిడిమర్రిలో విషాదం
కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మం డలం పగిడిమర్రిలో విషాదాన్ని నిం పింది. స్థానికులు, ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మగ్దూంఅలీ (54) తిప్రాస్‌పల్లి శివారులో వేరుశనగ సాగు చేశాడు.
ఊట్కూర్, ఫిబ్రవరి 15 : కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మం డలం పగిడిమర్రిలో విషాదాన్ని నింపింది. స్థానికులు, ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మగ్దూంఅలీ (54) తిప్రాస్‌పల్లి శివారులో వేరుశనగ సాగు చేశాడు. శనివారం పొ లానికి నీరు పారబెట్టేందుకు వెళ్లిన రైతు రాత్రి 9 గంటలు దాటినా ఇంటికి రాలేదు.
భార్య షాహిన్‌బేగం అతనికి ఫోన్‌చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి బావ మౌలాలీ, మరో వ్యక్తి అశోక్‌తో కలిసి పొలం వద్దకు వెళ్లింది. అడవి పందుల బెడద నుంచి పంట రక్షణ కోసం అమర్చిన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌కు ప్రమాదవశాత్తు రైతు కాలు తగిలి విద్యుదాఘాతానికి గురై పడి ఉన్నా డు. వెంటనే దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించా రు. రైతు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

