నవాబ్‌పేట, నవంబర్ 23 : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం నీర్సాబ్తండాకు చెం దిన రైతు రమేశ్‌నాయక్(36)కు రెండున్నర ఎకరాల పొలం ఉన్నది. వరి సాగుకు నీళ్లు పెట్టేందుకు శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లాడు. అక్క డ బోరు ఆన్‌చేసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే మోటర్ కనెక్షన్ ఉన్న స్టార్టర్ డబ్బా వద్ద విద్యుత్తు వైర్ తెగిపోయి ఉండటం ప్రమాదవశాత్తు కాలికి తాకడంతో విద్యుత్తు షాక్ తగిలింది.
పక్క పొలంలోని రైతు ధర్మనాయక్ గమనించి వెంటనే రమేశ్ కుటుంబసభ్యులకు సమాచారం అం దించాడు. వారు అక్కడకు చేరుకొని మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై విక్రమ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ముసుగులో రాక్షస పాలన సాగిస్తున్నదని మాజీ సర్పంచ్ల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ అక్కెనపల్లి కరుణాకర్ విమర్శించారు. కొండారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోగా శనివారం సిరిసిల్లలోని అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ సర్పంచ్ల జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు.
గాంధీ చౌక్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సోదరుల అరాచకాల వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్టు మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్‌నోట్ రాసినట్టు తెలిపారు. దోపిడీ, అణచివేత, నియంతృత్వమే నినాదంగా రేవత్‌రెడ్డి పాలన సాగుతున్నదని మండిపడ్డారు. ర్యాలీలో పాల్గొన్న మాజీ సర్పంచ్‌లు, జేఏసీ నాయకులు సాయిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
– సిరిసిల్ల టౌన్