భిక్కనూరు, ఆగస్టు 24: పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగ తగిలి ఓ రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి చెందిన చిదుర రాజిరెడ్డి (45) జంగంపల్లి శివారులో రాజంపేట్ మండలం బస్వాన్నపల్లిలో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఆదివారం ఆ భూమిలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా అడ్డువచ్చిన విద్యుత్తు తీగను పక్కకు జరుపుతుండగా కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.