పెగడపల్లి, మే 19: చెట్ల కొమ్మలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌కు గురై ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా నంచర్ల సమీపంలో జరిగింది.సోమవారం విద్యుత్తు సిబ్బంది వైర్ల కింద చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టారు. కొంతమంది రైతులతో కలిసి అక్కడికి వెళ్లిన ఎడ్ల రాజేందర్‌రెడ్డి (43), ట్రాన్స్ఫార్మర్ వైర్లకు అడ్డుగా ఉన్న ఒక చెట్టు కొమ్మను తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగ తగిలి షాక్‌కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 వాహనంలో జగిత్యాల దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ట్రాన్స్పార్మర్ వద్ద విద్యుత్తు సరఫరాను నిలిపి వేయకుండా పనులు చేపట్టడం వల్లే తన భర్త చనిపోయాడని రాజేందర్‌రెడ్డి భార్య విజయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడీఈ వరుణ్‌కుమార్, ఏఈ మధు, మార్కెట్ చైర్మన్ రాములుగౌడ్, నంచర్ల సింగిల్ విండో చైర్మన్ వేణుగోపాల్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.