తిమ్మాజిపేట, సెప్టెంబర్ 11 : అప్పుల భారంతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. హెడ్ కానిస్టేబుల్ రాజాశ్యాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ తండాకు చెందిన సక్రూ (42) పత్తి, వరి పంట సాగుతో పాటు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. వర్షాభావ పరిస్థితులకు తోడు ఇటీవల ఫారంలోని 10 వేల కోళ్లు చనిపోయాయి.
దీంతో అప్పు తీర్చే మార్గంలేక గురువారం యాసిడ్ తాగి వాంతులు చేసుకోగా.. కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 2 గంటల తర్వాత మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు హెడ్‌కానిస్టేబుల్ తెలిపాడు.