కామారెడ్డి : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన వారందరికీ చేయూత పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ బీడీ కార్మికులు శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ బీడీ పరిశ్రమేనని, 7.50 లక్షల బీడీ కార్మికులు దీనిపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కటాఫ్ డేట్ ఎత్తేసి, అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.