ఆ పదాల వెనుక అర్థాలు
ఈ రోజుల్లో సోషల్ మీడియా, రిలేషన్షిప్ల చుట్టూ అనేక కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా పురుషుల ప్రవర్తన, వారి వ్యక్తిత్వాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ రోజుల్లో సోషల్ మీడియా, రిలేషన్షిప్ల చుట్టూ అనేక కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా పురుషుల ప్రవర్తన, వారి వ్యక్తిత్వాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటి అసలు అర్థం, ప్రభావం గురించి పూర్తి అవగాహన లేకుండానే చాలామంది ఆ పదాలను వాడేస్తున్నారు. సోషల్ మీడియా, మాడ్రన్ డేటింగ్, పాప్ కల్చర్‌లో పురుషుల వ్యక్తిత్వాలు, ప్రవర్తనల గురించి తరచుగా చర్చకు వచ్చే ఆ పదాలు, వాటి అర్థాలు ఇదిగో ఇలా ఉన్నాయి..
సిగ్మామేల్: ఎవరి అండ లేకుండా, సమాజం విధించిన రూల్స్‌తో సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటూనే విజయం సాధించే వ్యక్తి. వీరు నలుగురిలో ప్రత్యేక గుర్తింపు కోరుకోరు. స్వతంత్రంగా, తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయే స్వభావం వీరిది. ఇలాంటివారిని తరచుగా ‘లోన్ వోల్ఫ్’ అంటారు.
ఆల్ఫా మేల్: ఆల్ఫా మేల్ అంటే అత్యంత ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. వీరు ఏ సమూహంలోనైనా ముందుంటారు. అందరి దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వం, నిర్ణయాధికారం వీరి సొంతం. అయితే కొన్ని సందర్భాల్లో ఇతరులపై ఆధిపత్యం ప్రదర్శించే ధోరణి కూడా వీరిలో కనిపిస్తుంది.
మిసోజినిస్ట్: స్త్రీల పట్ల ద్వేషం, చిన్నచూపు, అసహనం ప్రదర్శించే వ్యక్తిని మిసోజినిస్ట్ అని సంబోధిస్తారు. పురుషుల కన్నా స్త్రీలు తకువ అని భావించడం, ఆడవాళ్ల అభిప్రాయాలను అణగదొకాలని చూడటం వీరి లక్షణం. ఇది కేవలం పాత ఆలోచనా ధోరణి మాత్రమే కాదు, తీవ్రమైన వివక్షతో కూడిన ప్రవర్తన.
సెక్సిస్ట్: ఒక పని కేవలం స్త్రీలకు మాత్రమే లేదా పురుషులకు మాత్రమే పరిమితం అని మూస పద్ధతుల్లో ఆలోచించేవారిని సెక్సిస్ట్ అంటారు. ఉదాహరణకు వంట ఆడవాళ్లే చేయాలి, డబ్బులు సంపాదించడం మగవారి పని మాత్రమే అని గిరి గీసుకునే వారు.
మిసాండ్రిస్ట్: పురుషుల పట్ల ద్వేషం, తీవ్ర వ్యతిరేకత కలిగి ఉండే వ్యక్తి. సాధారణంగా ఇది పురుషులందరినీ చెడ్డవారిగా లేదా హింసాత్మక ప్రవర్తన కలిగినవారిగా సాధారణీకరించి చూసే సందర్భాలలో వాడుతుంటారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

