హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో/మీడియా కో-ఆర్డినేటర్ మహేశ్ మాణిక్య, వ్యక్తిగత సహాయకుడు కే మహేందర్‌రెడ్డి అలియాస్ మహేందర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 7న రాష్ట్ర అసెంబ్లీ వద్ద పోలీసులు, మార్షల్స్ విధులకు ఆటంకం కలిగించేలా బీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో నమోదైన కేసుల్లో వారిపై కఠిన చర్యలు చేపట్టవద్దని జస్టిస్ జే శ్రీనివాసరావు సైఫాబాద్ పోలీసులను ఆదేశించారు.
తమపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ మహేశ్, మహేందర్ దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. అప్పటివరకు వారిపై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించారు.