గంభీరావుపేట, ఏప్రిల్ 2: బావిలో పూడిక తీసే పనులు చూసేందుకు తాడు సాయంతో లోపలికి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి రైతు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫానగర్‌లో చోటుచేసుకున్నది.
ముస్తాఫానగర్‌కు చెందిన రైతు శివంది దేవయ్య(55) మండల కేంద్రంలోని పశువైద్యశాలలో సబార్డినేట్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఉన్న బావిలో క్రేన్ సాయంతో కూలీలను పెట్టి పూడిక తీయిస్తున్నాడు. పూడికను పరిశీలించేందుకు బుధవారం తాడు సాయంతో బావిలో దిగడానికి ప్రయత్నించగా, ప్రమాదవశాత్తూ జారి పడి మృతి చెందాడు.