మహ్మదాబాద్, ఏప్రిల్ 20 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘ టన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. గండీ డ్ మండలం పెద్దవార్వల్ గ్రామానికి చెందిన రైతు గొల్ల రాములు (61) నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. సోమవారం పంటకు నీరందించడానికి పొలానికి వెళ్లాడు. బోరు మోటర్ స్టార్టర్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు.