కమాన్పూర్, ఆగస్టు 31: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన రైతు గరిగంటి మల్లయ్య (55) ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్లయ్యను అతని కొడుకు రమేశ్ చెరువు వద్ద గల పొలానికి ఎరువు చల్లేందుకు దింపి వచ్చాడు.
మధ్యాహ్నమైనా తండ్రి ఇంటికి రాకపోవడంతో రమేశ్ వెళ్లి చూడగా మల్లయ్య పొలంలో పడిపోయి ఉన్నాడు. మృతుడి వీపు, చేతులు, కాళ్లు వెనుక భాగంలో చర్మం పూర్తిగా కాలిపోగా చలి పిడుగు పడడంతో మృతిచెందినట్టు గ్రామస్థులు తెలిపారు.