Telangana | బ్యాంకు అధికారుల వేధింపులకు రైతన్న బలయ్యాడు. వాళ్ల వేధింపులు తాళలేక బ్యాంకు ముందుకొచ్చి పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ విషాద ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బేల మండలం రేణిగూడకు చెందిన దేవ్‌రావ్ అనే రైతు ఆదిలాబాద్ ఐసీఐసీఐ బ్యాంకులో రుణం తీసుకున్నాడు. తనకు ఉన్న ఐదెకరాల వ్యవసాయ భూమిని మార్టిగేజ్ చేసి 3.50 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. దీనికి ఆరు నెలలకు ఒకసారి రూ.25వేల కిస్తీ చెల్లించాల్సి ఉంది. కానీ గత రెండు నెలలుగా జాదవ్ కిస్తీ చెల్లించలేకపోయాడు.
సమయానికి కిస్తీ కట్టకపోవడం బ్యాంకు అధికారులు జాదవ్ జాగోరావుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయనపై వేధింపులకు దిగారు. దీంతో బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక శనివారం ఉదయం పురుగుల మందు డబ్బాతో బ్యాంకుకు వచ్చాడు. అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే ఆయన్ను రిమ్స్‌కు తరలించారు. కానీ అప్పటికే జాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బ్యాంకు ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.
10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి : హరీశ్‌రావు
రైతు ఆత్మహత్యపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. రుణమాఫీ అయితే ఈ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశ్నించారు. ఈ రైతును చంపింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమేనని హరీశ్‌రావు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్, బేల మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన గిరిజన రైతు జాదవ్.. బ్యాంకు వాళ్లు అప్పు కట్టాలంటే, బ్యాంకులోనే పురుగుల మందు తాగి చనిపోయిండు.
రుణమాఫీ అయిపోతే ఈ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నడు. ఈ రైతును చంపింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే.
ఆత్మహత్య చేసుకున్న రైతుకు రూ. 10… pic.twitter.com/o7OYsG6ZFy
— Office of Harish Rao (@HarishRaoOffice) January 18, 2025