చిలిపిచెడ్, డిసెంబర్ 10: అప్పుల బాధతో పురుగులమందు తాగి రైతు ఆత్మహ త్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిలిపిచెడ్ మం డలం జగ్గంపేట లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జగ్గంపేటకు చెందిన నాగనోళ్ల పోచయ్య (50)కు పంట పెట్టుబడితో పాటు ఇల్లు కట్టుకోగా రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి.
వ్యవసాయం లాభసాటిగా లేక, అప్పు లు తీరేమార్గం కానరాక మనస్తాపం చెం దిన పోచయ్య సోమవారం ఇంటి నుం చి బయటికి వెళ్లిపోయాడు. రాత్రివరకు ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు సోదరుడు, కూతురు వెళ్లి చూడగా చెట్టుకింద పోచయ్య విగతజీవిగా కనిపించా డు. మృతుడి భార్య శేకమ్మ ఫిర్యాదు మేరకు ఏఎస్సై మిస్బొద్దీన్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని నర్సాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు.