ఐనవోలు, ఫిబ్రవ రి 25 : అప్పుల బాధతో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్లో కన్నా గౌరీ(36) ఆత్మ హత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీ వృత్తిరీత్యా గీత కార్మికుడు. ఎకరన్నర భూమిలో మక్కజొన్న, వరి సాగుచేశాడు.
కుటుంబ పోషణకు కూలి పనులకు వెళ్తుంటాడు. రెండేండ్లుగా పంటల దిగుబడి తగ్గడంతో పెట్టుబడి కోసం తెచ్చిన రూ.5లక్షల అప్పులు భా రమయ్యాయి. వాటిని ఎలా తీర్చాలనే ఆవేదనతో ఈ నెల 20న తన పొలంలో పురుగుల మందు తాగగా బుధవారం మృతి చెం దాడు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.