అప్పులబాధతో రైతు ఆత్మహత్య.. మెదక్ జిల్లా అక్కన్నపేటలో విషాదం
అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన మెదక్ జిల్లా రామాయంపేట మండ లం అక్కన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన రైతు పాపయ్యగారి మల్లేశం (35) శనివారం రామాయంపేటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు.
రామాయంపేట, ఏప్రిల్ 27 : అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన మెదక్ జిల్లా రామాయంపేట మండ లం అక్కన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన రైతు పాపయ్యగారి మల్లేశం (35) శనివారం రామాయంపేటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. మార్గమధ్యంలో అక్కన్నపేట శివారులో పురుగులమందు తాగి ఆత్మహత్యకు య త్నించాడు. గమనించిన స్థానికులు రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు వెంటనే కుటుంబీకులు సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించగా, సోమవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మృతిచెందాడు. మల్లేశం తనకున్న అర ఎకరంతో పాటు రెండెకరాలు కౌలుకు తీసుకుని అప్పుచేసి పంటలు సాగుచేశాడు. ఏడాది క్రితం తన కూతురు పెండ్లి చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో ఆందోళనకు గురై పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య ఇందిర, కూతురు, కొడుకు ఉన్నారు. రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

